ఏపీ శాసనసభ స్పీకర్‌గా శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస వైసీపీ ఎమ్మెల్యే తమ్మినేని సీతారాం ఎన్నికయ్యారు. అయితే ఈ కార్యక్రమంపై చంద్రబాబు తక్కసు వెళ్లగక్కుతూ సభా సాంప్రదాయాలను తుంగలో తొక్కారు. తమ్మినేని అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ మంత్రులతో సహా 30మంది ఎమ్మెల్యేలు నామినేషన్ పత్రాలపై సంతకాలు చేశారు..మంత్రులు బొత్స, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన, తానేటి వనిత, చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి తో పాటు పెద్దసంఖ్యలో ఎమ్మెల్యేలు వెంటరాగా తమ్మినేని శాసనసభ కార్యదర్శి పి.బాలకృష్ణమాచార్యులకు నామినేషన్ పత్రాలు అందజేశారు.
తమ్మినేనికి మద్దతుగా సంతకాలు చేసినవారిలో డిప్యూటీ సీఎంలు కె.నారాయణస్వామి, అంజాద్ బాష, మంత్రులు శ్రీవాణి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, ఆదిమూలపుసురేష్, ధర్మాన కృష్ణదాస్, అనిల్‌కుమార్ యాదవ్, ఎమ్ శంకర్ నారాయణ, శాసనసభ్యులు రఘురామిరెడ్డి, అంబటి రాంబాబు, బూడి ముత్యాలనాయుడు, సామినేని ఉదయభాను, కోలగట్ల వీరభద్రస్వామి, గొల్ల బాబూరావు, మద్దిశెట్టి వేణుగోపాల్, కరణం ధర్మశ్రీ, ఎం.నవాజ్ బాష, తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, విడదల రజని, ఫాల్గుణ, అర్థర్, వసంత వెంకట కృష్ణప్రసాద్, పెట్ల ఉమాశంకర్ గణేష్ ఉన్నారు.
ఈమేరకు సీఎం జగన్ స్పీకర్‌ను అభినందించారు. ఆయన్ను స్పీకర్ కుర్చీ వద్దకు తీసుకెళ్లి కూర్చొబెట్టారు. అలాగే మంత్రులు, చీఫ్ విప్, విప్‌లు, ఎమ్మెల్యేలు, టీడీపీ నేతలు, జనసేన ఎమ్మెల్యే కూడా తమ్మినేని అభినందించారు. అయితే ఇప్పటివరకూ ఎవరు స్పీకర్ అయినా ప్రతిపక్ష నేత కూడా వెళ్లి స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టాలి. అలాంటి చంద్రబాబు.. విలువల గురించి గంటలపాటు మాట్లాడే చంద్రబాబు తన మర్యాద కాపాడుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.