శాననసభలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఖరి అన్యాయంగా ఉందని వైసీపీ అధినేత ఏపీ నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన తమ్మినేని సీతారాంను సభాపతి స్థానం వద్దకు తీసుకెళ్లేందుకు ప్రతిపక్ష నాయకుడు రాకపోవడంతో సభలో ఇరుపక్షాల మధ్య వాదోపవాదాలు జరిగాయి. అయితే గత శాసనసభలో అధికార టీడీపీ చేసిన అన్యాయాలకు దేవుడు, ప్రజలు కలిసి సరైన జడ్జిమెంట్ ఇచ్చారని సీఎం వైఎస్ జగన్ అన్నారు. గత శాసనసభలో 23మంది ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను టీడీపీ అధినేత చంద్రబాబు సంతలో పశువులను కొన్నట్టు కొన్నారని, ముగ్గురు ఎంపీలను కూడా కొనుగోలు చేశారని, చివరకు ఏం జరిగిందని ఆయన టీడీపీ సభ్యులను ఉద్దేశించి ప్రశ్నించారు. పైన దేవుడు, ప్రజలు కలిసి మీ అన్యాయాలను తిప్పికొట్టారని, అన్యాయం చేసిన మాదిరిగానే టీడీపీకి 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు ఇచ్చారని, అదీ కూడా సరిగ్గా 23వ తారీఖు నాడే ఇచ్చారని, దేవుడు, ప్రజలు కలిసి ఇచ్చిన జడ్జిమెంట్ ఇదని, ఇంతకన్నా కరెక్ట్ జడ్జిమెంట్ ఉండదని పేర్కొన్నారు. ఇంకా చంద్రబాబు మాదిరిగా ప్రలోభాలు పెట్టి.. మంత్రి పదవులు ఇస్తానని ఆశ పెట్టి ఉంటే.. చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా కూడా దక్కి ఉండేది కాదని అన్నారు. మీ ఎమ్మెల్యేలను 6 గురిని మా పార్టీలో చేర్చుకుంటే మీకు 18 మంది మిగులుతారు…ఇక మీరు ప్రతి పక్షహోదాలో కూడ ఉండరు అని జగన్ అన్నారు. ఒకవేళ వైసీపీలోకి వస్తే టీడీపీకి రాజీనామా చేసి రమ్మని చెబుతా అని అన్నారు. ఎంతమంది టీడీపీ సభ్యులు తనతో టచ్‌లో ఉన్నారో చెప్పడం లేదని, అందుకు సంతోషపడాలని చంద్రబాబును ఉద్దేశించి పేర్కొన్నారు.
See Also : దాసరి నారాయణరావు కొడుకు కిడ్నాప్..!