తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని హైదర్ గూడలో ఎమ్మెల్యే , ఎమ్మెల్సీల కోసం కొత్తగా నిర్మించిన నివాస గృహాలను ఈనెల 17న స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డితో కలిసి సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. 17న ఏరువాకపౌర్ణమి పురస్కరించుకుని మంచి రోజు కావడంతో నివాస గృహాలను ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించుకున్నారు.ఈ సందర్భంగా 17న ఉదయం 6 గంటలకు కొత్త నివాసాలకు కేసీఆర్ గృహవాస్తు పూజలు చేయనున్నారు. మొత్తం 4.5 ఎకరాల్లో రూ. 166 కోట్లతో 12 అంతస్తులతో 120 క్వార్టర్లను నిర్మించారు. 2100 చదరపు అడుగుల ప్రతి క్వార్టర్‌లో 3 బెడ్‌రూమ్‌లను ఏర్పాటు చేశారు.