మాజీ ముఖ్యమంత్రి కుమారుడు.. ఆయన గెలిస్తే చాలు.. పిలిస్తే నిధులొస్తాయి.. రాష్ట్రానికి కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి బాట పట్టిస్తారు. ఇదీ ఎన్నికల సమయంలో టీడీపీ నేతలు చేసిన ప్రచారం. అయితే ఎన్నికల్లో నారా లోకేశ్ ఓటమి పాలవడంతో ఇక చినబాబు రాజకీయ జీవితం ముగిసినట్టేనా.. రాజధాని ప్రాంతంలో మితిమీరిన అవినీతే కొంపముంచిందా? అధినాయకుడి అసమర్థతే ఓటమి మూటగట్టిందా? ఇదీ ఎన్నికల ఫలితాలు వెడివడ్డాక తెలుగుదేశం పార్టీ నేతల్లో అంతర్మథనం. నారా లోకేష్ ఓటమికి ప్రధాన కారణాలు ఉన్నాయి. అవి ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర పౌరుల డేటాను అక్రమంగా ఒక ప్రైవేటు కంపెనీకి అడ్డగోలుగా అప్పజెప్పిన కేసులో రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన చంద్రబాబు, లోకేశ్ ను అరెస్ట్ చేస్తారని ప్రచారం జరుగుతుంది. ఐటీ గ్రిడ్స్ అనే కంపెనీ దగ్గర ఆంధ్ర ప్రదేశ్ ప్రజల వ్యక్తిగత వివరాలతో సహా డేటా అంతా దొరకడం, సదరు డేటాను తెలుగుదేశం పార్టీ ఆంధ్రలో ఓటరు లిస్టులను ప్రభావితం చేసేందుకు ఉపయోగిస్తుందనే ఆరోపణ రావడంతో చంద్రబాబు, లోకేశ్ ఉలిక్కిపడ్డారు అని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తెలిపిన సంగతి తెలిసిందే. అలాగే లోకేష్ రాజకీయ భవిష్యత్‌కు కూడా ముగిసినట్టేనని పేర్కొంటున్నారు. రాజధాని ప్రాంతంలో తెలుగుదేశం ప్రభుత్వం బలవంతంగా భూములు లాక్కుని అడ్డగోలుగా అవినీతికి పాల్పడింది. లంక అసైన్డ్ భూముల రైతులను ప్యాకేజీ విషయంలో టీడీపీ నాయకులు దారుణంగా మోసం చేశారు. పార్టీ నాయకులు ఇసుక, మట్టి దోపిడీకి సాగించారు.ఇదంతా చినబాబు హయంలో జరిగిందని వైసీపీ నేతలు అంటున్నారు. ఇప్పడు ఇవన్ని బయటకు లాగితే నారా లోకేష్ అరెస్ట్ అవ్వడం ఖాయమంటున్నారు వైసీపీ అభిమానులు.
