దివంగత దర్శకుడు దాసరి నారాయణరావు కొడుకు ప్రభు కనిపించటం లేదంటూ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ నెల 9న ఇంటి నుంచి బయటకు వెళ్లిన ప్రభు తిరిగి రాలేదు. ఎక్కడ వెతికినా కనిపించకపోవటంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. 2008లోనూ ప్రభు ఇలా అదృశ్యమయ్యారు. అప్పట్లో తిరిగి వచ్చిన ప్రభు తన భార్య సుశీల తనను కిడ్నాప్ చేసిందంటూ ఆరోపించారు. దాసరి మరణం తరువాత కుటుంబంలో నెలకొన్న వివాదాలు తారా స్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో దాసరి ప్రభు మరోసారి అదృశ్యం కావటంతో కుటుంబ కలహాలే కారణమని భావిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రభు కోసం గాలీస్తున్నారు.
Tags Dasari Narayana Rao hyderbaad missing