అధికారంలో ఉన్నాం కదా ప్రభుత్వ అధికారులపై దాడులు చేస్తె మమ్మల్ను ఎవరు ఏంచేయలేరులే అని అనుకున్న టీడీపీ నేతలకు ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి. గతంలోఐపీఎస్ అధికారి, రవాణా శాఖ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యంపై దౌర్జన్యం, బెదిరింపు కేసులో , రౌడియిజం , భూకభ్జాలు, ల్యాండ్ సెటిల్మెంట్లు – స్కామ్ లు – కాంట్రాక్టుల్లో కమీషన్లకు పాల్పడుతున్నారని ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. ఇలా చెప్పకుంటూ పోతే ఎన్నో నేరాలకు మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ కారకుడుని వైసీపీ నేతలు అన్నారు. ఈ క్రమంలోనే టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ పై పలు ఆరోపణలు వచ్చాయి. అందుకే విజయవాడలో అత్యతం దారుణంగా రౌడియిజం చేశారని విమర్శలు వెలువెత్తాయి. అంతేకాదు విజయవాడలో ఓ స్వతంత్ర్య సమరయోధుడి భూమిని బోండా ఉమ కబ్జా చేశారని ఆరోపణలు వచ్చాయి. అధికార పార్టీకి చెందిన ఉమ…..తన పలుకుబడితో ఆ భూమిని కబ్జా చేశారని ఆరోపణలు వచ్చాయి. ఫోర్జరీ సంతకాలతో నకిలీ డ్యాక్యుమెంట్లు సృష్టించి తమ భూమిని ఉమ కబ్జా చేశారని బాధితుడు రామిరెడ్డి కోటేశ్వరావు నగర కమిషనర్కు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా ఈ భూ కబ్జా వ్యవహారంలో ఉమ బెదిరింపులకు పాల్పడతున్నట్లు కూడా ఆయన ఆరోపించారు. రామిరెడ్డి ఫిర్యాదు చేసినా…పోలీసులు ఉమపై కేసు నమోదు చేసేందుకు ముందుకు రాలేదు. దీంతో ఇప్పుడు ప్రభుత్వం మారింది వైసీపీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అవినీతిని అంతం చేస్తానాని ప్రకటించగానే మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ గుండెళ్లో రైళ్లు పరుగెడుతున్నాయి అంట. ఇక చుక్కలే అంటున్నారు వైసీపీ అభిమానులు.
See Also : 40 ఏళ్ల రాజకీయ అనుభవశాలి తన గౌరవాన్ని కాపాడుకోలేకపోయారు