ఏపీలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భీమవరం, గాజువాక అసెంబ్లీ నియోజకవర్గాల నుండి బరిలోకి దిగిన సంగతి తెల్సిందే.భీమవరం నుండి వైసీపీ తరపున పోటి చేసిన గ్రంథి శ్రీనివాస్ చేతిలో పవన్ కళ్యాణ్ ఏకంగా మూడు వేల తొమ్మిది వందల ముప్పై ఎనిమిది ఓట్ల తేడాతో ఓడిపోయారు. అంతేకాకుండా గాజువాక నుండి వైసీపీ అభ్యర్థి నాగిరెడ్డి చేతిలోనూ ఘోరపరాజయం పాలయ్యాడు పవన్. అయితే సార్వత్రిక ఎన్నికల్లో ఓటమిపై సమీక్షా సమావేశం నిర్వహించిన పవన్ మాట్లాడుతూ ఎన్నికల్లో నన్ను ఓడించాడానికి నూట యాబై కోట్లను ఖర్చు చేశారని, ఓటుకు రెండు వేల నుండి ఐదు వేల వరకు పంచారన్నారు. భీమవరం,గాజువాక ఓటర్లు,ప్రజలు ఓటుకు నోటు తీసుకుని నన్ను మోసం చేశారు.
నాకు ఓట్లేయకుండా ఓడించారని ఆవేదనను వ్యక్తంచేశారు. అయితే పవన్ చేసిన మరో వ్యాఖ్య తీవ్ర కలకలం రేపింది. గుడిదగ్గర బిక్షాటన చేసేవాళ్లకే రోజుకు రెండు వేలకు మించి వస్తాయి. కానీ గాజువాక ,భీమవరం ప్రజలు తీసుకున్న రెండువేలు రోజుకు రూపాయి చొప్పున వస్తాయని, దీనికంటే భిక్షాటన చేస్కోవడం మంచిది కదా అని ఓటర్లను ఉద్ధేశించి ఈ సమీక్ష సమావేశంలో పవన్ తీవ్ర పదజాలంతో వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు,మేధావులు,ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు. జనసేన పార్టీ పెట్టి గతంలో 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పవన్ ఎన్ని కోట్లకు అమ్ముడుపోయాడు.
ఈ ఎన్నికల్లో సరైన భేరం కుదరక ఒంటరిగా బరిలోకి దిగాడంటున్నారు. అలాగే ఎలక్షన్ ముందు కూడా వైసీపీ అభ్యర్ధులను ఉరికించి కొడతాం.. పరుగెత్తించి కొడతాం.. నాకు దైర్యం ఉంది.. గుండెల్లో బలం ఉంది అనే పవన్.. ఎన్నికలైపోయాక కూడా తన పంధా మార్చుకోలేదు. నన్ను కొట్టారు.. నన్ను ఎంత బలంగా కొడితే అంత ఎదుగుతానంటూ తన కొట్టే భాషనే మాట్లాడారు. అలాగే ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కాలేరు.. ఇది శాసనం అని చెప్పారు. అయితే జగన్ సీఎం అయ్యారు సరికదా వైసీపీ అభ్యర్ధులు కనీసం పవన్ ని అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వలేదు.