ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక పూర్తయింది.. వైసీపీనేత తమ్మినేని సీతారం స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్పీకర్ పదవికి తమ్మినేని నామినేషన్ వేశారు. ఆయనను బలపరుస్తూ 30మంది సభ్యులు మద్దతు తెలపారు. నామినేషన్ల గడువు ముగిసే సమయానికి కేవలం ఒక్క నామినేషన్ మాత్రమే దాఖలు అవడంతో.. తమ్మినేని ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇవాళ 11గంటలకు స్పీకర్ గా ఆయన పదవీబాధ్యతలను చేపట్టనున్నారు. తమ్మినేని నియామకం పట్ల మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన తమ్మినేని స్పీకర్ గా ఉండాలని సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారని చెప్పారు. శాసన సభ విలువలను కాపాడేలా ఆయన వ్యవహరిస్తారన్నారు.
