స్పీకర్‌ను గౌరవంగా తనసీట్లో కూర్చోబెట్టే విషయంలో ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు ముందుకు రాకపోవడం చాలా బాధాకరమని, ఆయన తాను చేసిన తప్పుకు క్షమాపణ చెప్పాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అన్నారు. స్పీకర్ ధన్యవాద సభలో జగన్ మాట్లాడుతూ స్పీకర్‌గా తమ్మినేనని ఏకగ్రీవంగా ఎన్నుకున్నతర్వాత అన్నిపార్టీల నేతలు వచ్చి స్పీకర్‌ను తన సీట్లో కూర్చోవాలని ప్రోటెం స్పీకర్ అప్పలనాయుడు కోరారు. తరువాత సాదరంగా నేనులేచి, మిమ్మల్ని ఆలింగనం చేసుకొని, మీ సీట్లో కూర్చొబెట్టాం. చంద్రబాబు గారు మాత్రం అక్కడినుంచి లేవలేదు. అచ్చెన్నాయుడు వచ్చారు.
See Also : బుద్ధా వెంకన్న సహా మరో ఇద్దరు ఎమ్మెల్యేల ప్రధాన అనుచరుల అరెస్ట్ కు రంగం సిద్ధమైందా.?
ఇంతప్రక్రియ సాక్ష్యాత్తు కళ్లెదుట జరిగినా దాన్ని తప్పు చేసి కూడా కప్పిపుచ్చుకుంటున్నారు. ఒక అబద్ధాన్ని నిజంచేసేందుకు వందసార్లు చెప్పిందే చెప్తే అది నిజం కాదు.. ఇప్పుడు చంద్రబాబు కూడా చేస్తున్నారు. ప్రొటెంస్పీకర్ అందరినీ ఆహ్వానించినా ఆ ఆహ్వానాన్ని మన్నించి స్పీకర్ వద్దకు చంద్రబాబు రాలేదు.. తనకు బొట్టుపెట్టలేదని పేర్కొన్నారు. స్పీకర్ బీసీ వర్గానికి చెందిన వ్యక్తి.. అలాంటి వ్యక్తిని గౌరవించకుండా చంద్రబాబు దారుణంగా మాట్లాడుతున్నారు. చంద్రబాబు తాను చేసినతప్పుకు కచ్చితంగా క్షమాపణ చెప్పాలన్నారు. దీనిని ఇంతకన్నా ఎక్కువగా సాగదీయ వద్దని కోరారు.
See Also : జైలుకు వెళ్ళే బ్యాచ్ లో ముందు వరుసలో ఉన్న మాజీ మంత్రి ఇతనే..?