కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ప్రభుత్వం భారీఎత్తున ఏర్పాట్లు చేస్తున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తిస్థాయిలో రీడిజైన్‌చేసి, రెండున్నరేండ్ల రికార్డు సమయంలోనే ప్రాజెక్టు ద్వారా నీటిని విడుదలచేస్తున్న దరిమిలా కార్యక్రమాన్ని పండుగలా జరిపేందుకు కసరత్తు మొదలైంది. ఈ నెల 21న అధికారికంగా కన్నెపల్లి పంపుహౌస్‌లోని మోటర్ల వెట్న్ ప్రారంభం కానున్నది. ప్రస్తుతం ఎగువనుంచి ఇన్‌ఫ్లోలు లేకపోవడంతో ఒకేసారి మోటర్లను నడిపేందుకు ఆస్కారం లేకుండాపోయింది. గోదావరికి ఇన్‌ఫ్లోలు మొదలైన తర్వాత జూలైలో అన్ని మోటర్లు నడుస్తాయి. ప్రస్తుతం కన్నెపల్లి పంపుహౌస్ వద్ద గోదావరిలోకి 500 క్యూసెక్కులలోపు మాత్రమే వరద వస్తున్నట్లుగా ఇంజినీర్లు తెలిపారు. ఈ క్రమం లో రోజుకు రెండు మోటర్లను అరగంట చొప్పు న నడిపేందుకు సాంకేతికంగా వీలుపడుతుందని చెప్తున్నారు. ఈ నెల 21న రెండు మోటర్లకు వెట్న్ నిర్వహిస్తారని, ఒక్క మోటర్‌ను అరగంట పరీక్షించే క్రమంలో 0.004 టీఎంసీలు అంటే 10.80 కోట్ల లీటర్ల గోదావరిజలాల్ని ఎత్తిపోయవచ్చని ఇంజినీర్లు తెలిపారు.