కడప జిల్లాలో 38ఏళ్లు రాజకీయ చరిత్రను 38ఓట్లతో కూల్చామని జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి విర్రవీగేవారు. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రతిపక్ష ఎమ్మెల్యే అయిన్ప్పటికీ ఆదినారాయణరెడ్డికి మంత్రి పదవి కట్టబెట్టారు. పదవి రాగానే అంతా తానై టీడీపీలో చక్రం తిప్పారు. అదే ఇప్పుడు పార్టీని నాశనం చేసిందని ఆ పార్టీ సీనియర్లు బాహాటంగా వ్యాఖ్యానిస్తున్నారు. అందుకే తాజా ఎన్నికల్లో ఆదినారాయణరెడ్డి పోటీచేసి అవినాష్‌రెడ్డి చేతిలో 3,80,976 ఓట్లు తేడాతో ఓడిపోయారు. అయితే వైఎస్ కుటుంబాన్ని దూషిస్తే టీడీపీ అధినేత చంద్రబాబు తనకు అగ్రపీఠం వేస్తారని ఆదినారాయణ రెడ్డి వైఎస్ కుటుంబాన్ని టార్గెట్ చేసి దారుణమైన వాఖ్యలు చేశారు. అయితే ఇప్పుడు వైసీపీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారంలో ఉన్నాడు. అవీనితిని అంతం చేస్తానాని ప్రకటించాడు. దీంతో టీడీపీ నేతల గుండెళ్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ముఖ్యంగా ఆదినారాయణరెడ్డి ఖచ్చింతగా జైలుకే అంటున్నారు కడప వైసీపీ వర్గాలు. ఎందుకంటే ఎన్నికల సమయంలో ..అంతకముందు చేసిన అన్నింటిపై సమగ్ర విచారణ జరిపి అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అంతేకాదు జగన్ బాబాయ్ వివేకా హత్య కేసులో ఆదినారాయణరెడ్డి హస్తం ఉందని వైఎస్‌కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఇక కేసు కూడ విచారణ జరిపితే అరెస్ట్ అయ్యో అవకాశం ఉంది.
