టీడీపీ ఎంపీ కేశినేని నాని మరోసారి వార్తల్లోకెక్కారు. తాజాగా ఆయన మరో ట్వీట్ చేసారు.
కేశినేని ట్వీట్ యధాతధంగా..
నేను స్వయంశక్తిని నమ్ముకున్న వ్యక్తిని.
ఎవరి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడే వాడిని కాదు.
నీతి, నిజాయితీ, వక్తిత్వం, ప్రజాసేవ మాత్రమే నా నైజం.
నిజాన్ని నిజమని చెబుతాను.
అబద్ధాన్ని అబద్దమనే చెబుతాను.
మంచిని మంచి అనే అంటాను.
చెడును చెడు అనే అంటాను.
న్యాయాన్ని న్యాయమని మాట్లాడతాను.
అన్యాయాన్ని అన్యాయమని మాట్లాడతాను.
ఉన్నది ఉన్నట్లు మాట్లాడడం మాత్రమే తెలిసిన వాడిని.
నిండు సభలో రాష్ట్రానికి జరిగిన అన్యాయం కోసం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన వాడిని నేను.
నిండు సభలో మోడీని నిలదీసిన వ్యక్తిని.
భయం నా రక్తంలో లేదు.
రేపటి గురించి ఆలోచన అంతకంటే లేదు.
ఎవరెన్ని పెడార్థాలు తీసిన, వీపరీతార్థాలు తీసిన లెక్క చేసే వాడిని కాదు.
అంటూ నాని స్పష్టం చేసారు. వివరాల్లోకి వెళ్తే.. పార్టీలో తనకు తగిన ప్రాధాన్యత దక్కలేదని, తిరగబడుతున్న నాని కొద్దిరోజులుగా సోషల్‌మీడియాలో పోస్ట్ లతో తమ పార్టీనేతలపై పరోక్ష వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇది రెండోసారి.. అయితే ఈ పోస్ట్ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, మాజీమంత్రి దేవినేని ఉమనుద్దేశించి పెట్టినదేనని టీడీపీ కార్యకర్తలు చెప్పుకుంటున్నారు. దేవినేని ఉమ ఒంటెద్దు పోకడల వల్ల జిల్లాలో పార్టీకి తీవ్ర నష్టం జరిగిందని, ఆయనకు చంద్రబాబు అడ్డుచెప్పలేదని ఐదేళ్లు తీవ్ర అసంతృప్తితో రగిలిపోయిన కేశినేని ఇప్పుడు డైరెక్ట్ గా పోరాటానికి దిగారు. విజయవాడ ఎంపీగా రెండవసారి గెలిచిననాటినుంచి నాని ఇలా వ్యవహరిస్తున్నారు. అలాగే చంద్రబాబు ఇచ్చిన లోక్‌సభ విప్ పదవి కూడా తిరస్కరించారు. మరోవైపు నాని బీజేపీలో చేరతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ ప్రచారం కూడా టీడీపీ నేతలే చేస్తుండడం గమనార్హం
