దక్షిణాది రాష్ట్రాలలో అత్యధిక ఎంపీసీట్లు గెలుచుకున్న పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్.. దేశమంతా జగన్ పార్టీ పేరు మారుమ్రోగింది. అయితే ఇపుడు పార్టీకి, పార్టీ చీఫ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రధాని కేంద్రంలో పెద్దపీట వేస్తున్నట్లు తెలుస్తోంది. వైసీపీకి చెందిన లోక్ సభ సభ్యుల్లో ఒకరికి డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వనున్నారట. ఇందులో భాగంగానే తాజాగా బీజేపీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహరావు తాజాగా ఏపీముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసారు. ఒకవైపు జీవీఎల్ మాత్రం తాను ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగానే కలిశానని, రాష్ట్రాభివృద్ధి, రాష్ట్ర సమస్యలపై మాట్లాడానని చెప్పారు. రాష్ట్రప్రయోజనాలు, కేంద్ర ప్రభుత్వం సహకారంపై చర్చించామన్నారు. తమమధ్య రాజకీయాలపై ఎలాంటి చర్చ జరగలేదన్నారు.. స్పెక్యులేషన్‌లకు తాను సమాధానం చెప్పలేనన్నారు. అలాగే డిప్యూటీ స్పీకర్ పదవి వైసీపీ ఎంపీకి ఇవ్వడం విషయం మాత్రం వాస్తవమేనని అన్నారట. బీజేపీ అధిష్టానం నిర్ణయించిన నిర్ణయాలను తాము వెల్లడిస్తామని జీవీఎల్ స్పష్టం చేసారు,. దీనినిబట్టి జగన్ కు కేంద్రం మద్దతిస్తున్నట్టు, ప్రోత్సహిస్తున్నట్టు కనిపిస్తోంది.
