Home / ANDHRAPRADESH / ఏపీలో పెట్టుబ‌డులు స్ట్రాట్..కర్నూల్ జిల్లాకు 2500 కోట్లతో భారీ పరిశ్రమ

ఏపీలో పెట్టుబ‌డులు స్ట్రాట్..కర్నూల్ జిల్లాకు 2500 కోట్లతో భారీ పరిశ్రమ

ఏపీలో జరిగిన ఎన్నికల్లో ఫ్యాన్‌ సునామీ సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ ఫ్యాన్ గాలీకి సైకిల్‌ అడ్రెస్‌ లేకుండా కొట్టుకుపోయింది. ఇక గ్లాస్‌ అయితే ముక్కలుచెక్కలుగా పగిలిపోయింది. మొత్తం 175 నియోజక వర్గాల్లో 151 అసెంబ్లీ, 23 పార్లమెంట్‌ స్థానాలను వైసీపీ అఖండ మెజార్టీతో గెలిచింది.ఏపీ రాష్ట్ర ప్రజలంతా విలువలు, విశ్వసనీయతకు పట్టం కట్టారు. రాజకీయాల్లో విలువల పరిరక్షణకు, ప్రజలందరి శ్రేయస్సు కోసం పరితపిస్తున్నవైసీపీ అధినేత , ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు అండగా నిలిచారు. అయితే ఆనాడు చంద్రబాబు అన్న మాటలు చూస్తే అంతా అపద్దం అని తెలుస్తుంది. ఆయన ఆనాడు ఏమన్నారంటే ఒకవేళ ఏపీలో వైఎస్ జ‌గ‌న్‌ గెలిస్తే…రాష్ట్రం ఏమైపోతుందో అనే అప‌న‌మ్మ‌కంతో పెట్టుబ‌డిదారులు ఉన్నార‌ని…జ‌గ‌న్ వస్తే మేం రాష్ట్రం వైపు చూసేది లేద‌ని త‌న‌తో అన్నార‌ని చంద్ర‌బాబు డ‌బ్బా కొట్టుకున్నాడు. దానికితోడు పచ్చమీడియాలో విపరీతంగా ప్రచారం చేయించాడు. కాని నేడు చంద్రబాబు అన్న మాటలను ప‌టాపంచ‌లు చేస్తూ రాష్ట్రంలోకి పెట్టుబ‌డుల ప‌ర్వం మొద‌లైంది. ఐదు దేశాల్లో విస్తరించిన ఆదిత్య బిర్లా గ్రూపు సంస్థల్లో ఒకటైన అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీ ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూల్ జిల్లాలోని పెట్నికొటె గ్రామంలో రూ.2వేల 500కోట్ల భారీ ప్రాజెక్టు చేపట్టనుంది. భారతదేశంలోని మంచి నాణ్యత గల ఉత్పత్తిగా పేరొందిన అల్ట్రాటెక్ సిమెంట్ ఇండస్ట్రీకి అనుమతి లభించింది, ఇంటిగ్రేటెడ్ సిమెంట్ ప్లాంటును ఏర్పాటు చేసి 900 మందికు పైగా ఉపాధి కల్పించనున్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి దాదాపు 2500 కోట్లతో 431.92హెక్టార్ల భూమిని ఇప్పటికే కంపెనీ కొనుగోలు చేసింది. ఆంధ్రప్రదేశ్ కాలుష్య నివారణ బోర్డు నుంచి అనుమతులు వస్తే.. ఇక అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీ పనులు ప్రారంభం అవుతాయి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat