తెలుగు రాజకీయాల్లో మరో కీలక పరిణామం. ఇటీవలి కాలంలో అధికార టీఆర్ఎస్ పార్టీపై ఉద్దేశపూర్వకంగా బురదజల్లుతున్న ఇద్దరు నేతలు సమావేశం అయ్యారు. టీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ నేత జి.వివేక్‌తో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు. ఈ భేటీ చర్చనీయాంశంగా మారింది.
హైదరాబాద్‌లో వివేక్‌కు చెందిన మీడియా కార్యాలయంలో రేవంత్ రెడ్డి, వివేక్ సమావేశం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరు నేతల మధ్య దాదాపు గంట పాటు చర్చ జరిగినట్లు సమాచారం. ఏ అంశంపై చర్చించారనే అంశంపై స్పష్టత రానప్పటికీ…ప్రభుత్వంపై మండిపడే ఇద్దరు నేతలు ఇలా సమమావేశం అవడం ఆసక్తికరంగా మారింది. ప్రభుత్వంపై తను చేసే విమర్శలకు మీ మీడియాలో ప్రాధాన్యం ఇవ్వాలని కోరేందుకే..రేవంత్ మాజీ ఎంపీ వివేక్‌తో సమావేశం అయి ఉంటారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.