చట్టాన్ని ఉల్లంఘిస్తే చర్యలు తీసుకునేలా కొత్త చట్టం తెస్తున్నామని, పంచాయతీ రాజ్ వ్యవస్థను మరింత పటిష్టం చేస్తామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ వ్యాఖ్యానించారు. ఈ రోజు కరీంనగర్ జిల్లా ఉమ్మడి జెడ్పీ సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి పాల్గొని మాట్లాడారు. రానున్న కొత్త పంచాయతీ రాజ్ చట్టం ద్వారా మళ్లీ స్థానిక సంస్థలకు అధికారాలు బదలాయిస్తామని తెలిపారు. స్థానిక ప్రజాప్రతినిథులకు అధికారాలు ఇస్తే అభివృద్ధి జరుగుతుందనేది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన అని అన్నారు . అసెంబ్లీలో చట్టసవరణ చేశాక స్థానిక సంస్థలకు చెక్‌పవర్, అధికారాలు ఇస్తామని పేర్కొన్నారు.మిషన్ భగీరథను ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయని, హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
