జోగులాంబ జిల్లా గద్వాల మాజీ ఎమ్మెల్యే గట్టు భీముడు బుధవారం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. భీముడి మృతి చెందడం పట్ల టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంతాపం ప్రకటించారు. ఈ సందర్భంగా రేపు ఉదయం 9 గంటలకు గట్టు మండలం బల్గెరా గ్రామం కు చేరుకొని భీముడు అంత్యక్రియల్లో కేటీఆర్ పాల్గొంటారు.
