యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం భక్తుల సౌకర్యార్థం హైదరాబాద్ నగరంలోని బర్కత్ పురాలో నిర్మించిన యాదాద్రి భవన్ సమాచార కేంద్రాన్ని ఈనెల 14న ఉదయం 10 గంటలకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రారంభించనున్నారు. ఈ భవన ప్రారంభోత్సవ ఆహ్వాన పత్రికను మంత్రి ఎ. ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మేల్యే గొంగిడి సునీతలు మంగళవారం ప్రగతిభవన్ లో ముఖ్యమంత్రిని కలిసి అందజేశారు.