ఏపీ కేబినెట్ కొలువుదీరింది.. 25మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసేశారు. సీనియర్లు, యువత, మహిళలతో మంత్రివర్గం సమతూకంగా ఉంది. సీనియర్లకు కూడా పెద్దపీట వేశారు సీఎం జగన్. అనూహ్యంగా ఊహించనివారికి కూడా పదవులు కేటాయించారు. జిల్లాలు, సామాజికవర్గాల లెక్కలతో అనూహ్యంగా పదవులు దక్కించుకున్నారు కొందరు. అదృష్టం కలిసొచ్చి కొందరు ఎమ్మెల్యేలకు మంత్రిపదవులు దక్కాయి.ఎక్కువమందికి సామాజికవర్గ సమీకరణాల్లో భాగంగా పదవులు వరించాయి. అయితే పార్టీకోసం ఎప్పటినుంచే బలమైన గళం వినిపించని కాకాణి గోవర్ధన్, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఫైర్ బ్రాండ్ ఆర్కేరోజా, గడికోట శ్రీకాంత్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి, కోన రఘుపతి, కొలుసు పార్ధసారధి, జగన్ మాట ఇచ్చిన మర్రి రాజశేఖరరెడ్డి, భీమవరంలో పవన్ ని ఓడించిన గ్రంధి శ్రీనివాస్ వంటివారికి పదవులు దక్కుతాయని వేసిన అంచనాలను జగన్ తలక్రిందులు చేసారు.
దీనిపైనా విమర్శలు వినిపిస్తున్నాయి. విమర్శలు ఎలాగో విమర్శిస్తారు.. సీనియారిటీ అని ఇస్తే సామాజిక న్యాయం జరగలేదంటారు.. సామాజిక న్యాయంచేస్తే సీనియారిటీని గౌరవించలేదంటారు.. కానీ జగన్మోహన్ ఎవరికి అన్యాయం చేయరని, ఇప్పుడు వచ్చిన మంత్రి పదవులు కూడా రెండున్నర సంవత్సరాలు అని ధైర్యంగా చెప్పి ముందుగానే చెప్పడం.. తరువాత రాబోయే రోజుల్లో కచ్చితంగా ఇప్పుడు పదవులు రానివారందరికీ న్యాయం జరుగుతుందని, అందరికీ మంత్రి పదవులు ఇస్తానని ముందుగానే చెప్పారట.. అందుకే అందరూ సంతోషంగా ఉన్నారట.. మధ్యలో కొందరు అపార్థం చేసుకుని విబేధాలు తెచ్చుకోవద్దని కొందరు పార్టీ నేతలు చెప్తున్నారు. జగన్మోహన్రెడ్డి మాట తప్పడు మడమ తిప్పడు..
ఇది రాసి పెట్టుకోవాలని రెండున్నరేళ్లవరకూ చూడాలని కోరుతున్నారు. అలాగే ఇదొక రాజకీయ ఎత్తుగడలా కనిపిస్తోంది.. సామాజిక సమీకరణాలకు పెద్దపీట వేయడంద్వారా క్షేత్ర స్థాయిలో పార్టీ ని మరింత బలపరుచుకోవడం, స్థానికసంస్థల ఎన్నికల్లో ఇతర పార్టీలను కనీసం పుంజుకోకుండా చేయడంకోసం ఈ స్ట్రాటజీ వాడుతున్నారట.. అలాగే ఈ టీం లోకల్ బాడీ ఎలక్షన్ ని ఫేస్ చేస్తుంది.. రెండున్నరేళ్ల తర్వాత వచ్చే సీనియర్ టీం అసెంబ్లీ ఎలక్షన్ ని ఫేస్ చేస్తుంది. అలాగే కాపు సామాజిక వర్గం నుండి అంబటి రాంబాబుకు డిప్యూటీ సీఎం, ఆర్కే రోజా, చెవిరెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, ధర్మాన , ముదునూరి ప్రసాదరాజు , మేరుగ నాగార్జున వంటి వారు కూడా తర్వాత టీంలో కలుస్తారు. అసెంబ్లీ ఎన్నికలకోసం సీనియర్స్ తో ఫుల్ టీం రెడీ చేసుకొని వైసీపీ మళ్ళీ క్లీన్ స్వీప్ చేయడంలో భాగంగా ఆటార్గెట్ ను దృష్టిలో పెట్టుకుని జగన్ వారికి మంత్రి పదవులు ఇవ్వలేదని చెప్తున్నారు.