టమాటా పేరు వింటేనే నోరు ఊరుతుంది కదా.. పచ్చి టమాటా దగ్గర నుండి పండు టమాటా వరకు దేన్ని వదలకుండా మనం తింటాం. టమాటా చెట్నీ .. టమాటా కరీ.. టమాటా చారు ఇలా పలు రకాల వంటలతో విందుభోజనం చేస్తాం. ఇంట్లో వంట అయిన పెండ్లిలో విందుభోజనం అయిన కానీ టమాటా లేకుండా ఉండదంటే అతిశయోక్తి కాదేమో.. అంతగా టమాటాను మనం వంటల్లో వినియోగిస్తాం. అయితే టమాటా వలన ఉపయోగాలు ఎంటో ఒక లుక్ వేద్దామా..
టమాటాను తినడం వలన పలు రకాల క్యాన్సర్లు రాకుండా అడ్డుకుంటుంది. ప్రస్తుత బిజీ బిజీ షెడ్యూల్లో సరిగా తినకపోవడం… సరిగా నిద్రపోకపోవడం వలన వచ్చే గుండె సంబంధిత వ్యాధులు రాకుండా నివారిస్తుంది. నియంత్రణ లేని బీపీని తగ్గిస్తుంది. మన మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది.కాలంతో పాటు వచ్చే మతిమరుపును ,డిప్రెషన్లను నివారిస్తుంది.
సరిగ్గా అన్నం తినకపోవడం వలన వచ్చే డయాబెటిస్,హైపర్ టెన్సన్ ను తగ్గించడంలో దోహదపడుతుంది. చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతుంది. కంటి ఆరోగ్యాన్ని కాపాడటంలో సహాయపడుతుంది. మన ఎముకలను దృఢంగా ఉంచడంలో సహాయపడుతుంది.