ప్రపంచ కప్ రెండో మ్యాచ్లో ఆసీస్ పై గెలుపొంది మంచి ఊపు మీదున్న టీమ్ ఇండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆసీస్ తో జరిగిన మ్యాచ్లో 117పరుగులతో రాణించిన టీమ్ ఇండియా ఓపెనర్ శిఖర్ దావన్ ఆ మ్యాచ్లో ఆసీస్ బౌలర్ కౌల్టర్ నైల్ వేసిన షార్ట్ పిచ్ బంతి బొటన వేలికి బలంగా తాకడంతో గాయపడిన సంగతి విదితమే.
గాయం అయిన కానీ ప్రాథమిక చికిత్స తర్వాత బ్యాటింగ్ కొనసాగించాడు. ఆ తర్వాత ఫీల్డింగ్‌కు ధావన్ స్థానంలో జడేజా వచ్చిన సంగతి కూడా తెల్సిందే. మ్యాచ్ అనంతరం స్కానింగ్ చేసిన వైద్యులు దాదాపు మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా శిఖర్ దావన్ కు సూచించారు.
దీంతో టీమ్ ఇండియా ఆడనున్న న్యూజిలాండ్, పాకిస్థాన్, అఫ్గనిస్థాన్ లతో జరగనున్న మ్యాచులకు దావన్ దూరం కానున్నాడు. అయితే ప్రపంచ కప్ లో రెండు మ్యాచులను గెలుపొంది మంచి ఊపు మీదున్న టీమ్ ఇండియాకు దావన్ దూరమవ్వడం గట్టి ఎదురుదెబ్బ అని వ్యాఖ్యానిస్తున్నారు క్రికెట్ విశ్లేషకులు..