నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వైసీపీ అధినేత ,ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఇటీవల ఇరవై ఐదు మందితో మంత్రి వర్గ విస్తరణ చేసిన సంగతి తెల్సిందే. గత సార్వత్రిక ఎన్నికల్లో నూట యాబై ఒక్క స్థానాలతో ఘనవిజయం సాధించిన తర్వాత వైసీపీ తరపున మహిళా కోటాలో నగరి ఎమ్మెల్యే,ఏపీ ఫైర్ బ్రాండ్ ,ఆ పార్టీ మహిళా విభాగ అధ్యక్షురాలు అయిన ఆర్కే రోజాకు ఖచ్చితంగా మంత్రి పదవీ వస్తుందని అందరూ భావించారు.
మంత్రుల ప్రమాణస్వీకార రోజున ఉదయం కూడా ఎమ్మెల్యే ఆర్కే రోజా ఎంతో ఆనందంగా మీడియా సమావేశంలో పాల్గోనడాన్ని బట్టి చూసి ముఖ్యమంత్రి జగన్ మంత్రి పదవీ ఇవ్వడం ఖాయమని వార్తలు వచ్చాయి. అయితే ఎవరు ఊహించని విధంగా రోజాకు మంత్రి వర్గంలో చోటు దక్కలేదు.
ఆ తర్వాత మంత్రి వర్గంలో రోజాకు చోటివ్వకపోవడంపై పలు పుఖార్లు,వార్తలు వైరల్ అయ్యాయి. తనకు మంత్రి పదవీ రాకపోవడం గురించి ఎమ్మెల్యే రోజా తొలిసారిగా స్పందించారు. ఈ రోజు మంగళవారం మీడియాతో రోజా మాట్లాడుతూ”తనకు మంత్రి పదవీ ఇవ్వమని ఎవర్ని అడగలేదు. మంత్రి వర్గ విస్తరణ రోజు తనను జగన్ ను కలిసినట్లుగా వస్తోన్న వార్తలు నిజం కాదు. కులాల ఈక్వేషన్ కారణంగానే తనకు మంత్రి వర్గంలో చోటు ఇవ్వలేదని “ఆమె అసలు విషయం బయటపెట్టారు..