తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తన గొప్ప మనస్సును చాటుకున్నారు. ఫేస్బుక్ మొదలు ట్విట్టర్ వరకు.. ఆఫ్ నెట్ కాల్ నుండి వాట్సాప్ కాల్ వరకు మాధ్యమం ఏదైన కానీ నాకు సమస్య ఉందంటే చాలు క్షణాల్లో స్పందించి.. ఆ సమస్యకు పరిష్కారం చూపిస్తుంటారు కేటీఆర్. తాజాగా రాష్ట్రంలో రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన తంగళపల్లి నివాసి ,చేనేత కార్మికుడైన మామిడాల కిరణ్ కుమార్ గత కొంత కాలంగా నడుము తుంటి బొక్క సమస్యతో తీవ్ర అనారోగ్య పాలయ్యారు. ఇప్పటి దాకా ట్రీట్మెంట్ కోసం ఆరు లక్షల దాకా ఖర్చు చేశారు.
ఎన్నో ఆసుపత్రుల చుట్టూ గుళ్ళ చుట్టూ తిరిగారు కిరణ్ కుమార్. అయితే ఇటీవల మరల పరీక్షలు చేయించుకున్న కిరణ్ కు వైద్యులు ఆదిరిపోయే విషయం చెప్పారు. ఈ సందర్భంగా వైద్యులు తుంటి బొక్క అరిగి ఇన్ ఫెక్షన్ సోకిందని కిరణ్ కుమార్ కు తెలిపారు.
ఆపరేషన్ చేయడానికి సుమారు రెండు లక్షల ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పడంతో ఏమి చేయాలో ఆర్ధం కాక తీవ్ర బాధలో ఉన్న కిరణ్ కుమార్ మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు అంకారపు రవీందర్ ద్వారా కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్పందించిన కేటీఆర్ వెంటనే రెండు లక్షల రూపాయలను ఎల్వోసీ మంజూరు చేయించాడు.అంతే కాకుండా హైదరాబాద్ మహానగరంలో నిమ్స్ ఆసుపత్రిలో ఆపరేషన్ కు సరైన ఏర్పాట్లు చేయాలని సంబంధి అధికారులను ఆదేశించి మరోసారి తనకు తానే సాటి నిరూపించుకున్నారు కేటీఆర్..