భారతదేశంలో ఎక్కడా లేనివిధంగా ఏపీలో ప్రైవేటు స్కూళ్ల వ్యాపారం జరుగుతుంది. ప్రభుత్వ పాఠశాలలను మూతపెట్టి గత ప్రభుత్వం సొంత పార్టీనేతల ప్రైవేటు విద్యా సంస్థలకు విద్యారంగాన్ని రాసిచ్చేసింది.. ప్రభుత్వ పాఠశాలలు అందుబాటులో లేకుండాచేసి గత్యంతరం లేని విధంగా పరిస్థితులను కల్పించింది టీడీపీ ప్రభుత్వం. దీనికారణంగా పిల్లల్లో విపరీతమైన ఒత్తిడి పెరిగింది. మొత్తంగా విద్యా వ్యవస్థనే భ్రష్టు పట్టించారు. ఎల్కేజీ చదువుకు లక్షల రూపాయిలు కట్టాల్సిన పరిస్థితిలో సామాన్యులు ఎన్నో అవస్థలూ పడుతున్నారు. అయితే కొత్త మంత్రివర్గంలో దీనిపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇకనుండి రాష్ట్రవ్యాప్తంగా రాజన్న బడిబాట నిర్వహిస్తామని విద్యాశాఖమంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు.
100శాతం పిల్లలు స్కూళ్లలో చేరేలా తాము కృషి చేస్తామన్నారు. అలాగే ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజులు నియంత్రించేందుకు కమిటీ వేస్తున్నామని, విద్యను వ్యాపారం చేస్తే సహించబోమన్నారు. విద్యాసంస్కరణలకోసం నూతన విద్యావిధానాన్ని నిపుణుల సాయంతో రూపొందిస్తామన్నారు. 2019 నుండి 2024 వరకు మార్పులు చేసి నూతన పాలసీ తీసుకొస్తామన్నారు. అమ్మఒడి పథకాన్ని జనవరి 26నుండి అమలు చేస్తామ్ననారు. జగన్ మోహన్ రెడ్డి తొలి క్యాబినెట్ నిర్ణయాలతోనే విద్యావిధానంలో సంస్కరణలు మొదలయ్యాయంటూ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. విద్య విదానం విషయంలో తేడా వచ్చినా, అలసత్వం వహించినా సీఎం సహించనని చెప్పారంటూ మంత్రి సురేష్ వెల్లడించారు.