ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర సచివాలయంలోని తన చాంబర్ లోకి మొదటిసారి అడుగిడుతున్న సందర్భంగా వేదపండితులు ఆశీర్వచనాలతో స్వాగతం పలికారు. అయితే సీఎం జగన్ కు స్వాగతం పలికిన వేదపండితులలో గుంటూరు జిల్లా నరసరావుపేట తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ సభ్యుడు, జిల్లా కోర్టులో జీపీగా పనిచేస్తున్న జి.సుధీర్ వేదపండితులు ముసుగులో పాల్గొనడాన్ని చూసిన నరసరావుపేటలోని వైసీపీ నాయకులు, న్యాయవాదులు ఎంతో ఆశ్చర్యానికి గురవుతున్నారు.. ఇతను ఇప్పటివరకూ ఎప్పుడూ, ఎక్కడా అర్చకత్వం, పౌరోహిత్య కార్యక్రమాల్లో పాల్గొనలేదని, అలాంటి టీడీపీ లీగల్ సభ్యుడు, న్యాయవాది అయిన సుధీర్ ఏకంగా ముఖ్యమంత్రి ఛాంబర్ లో కనిపించటం నరసరావుపేట ప్రజల్లో తీవ్ర ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
అలాగే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆశీర్వచనాలు అందజేస్తున్న వేదపండితులలో తెలుగుదేశం పార్టీ లీగల్ సభ్యులు, ఆపార్టీ సిఫార్సులతో జిపిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సుధీర్ ఉండటం, ఆయనను ముఖ్యమంత్రి ఛాంబర్ లోకి అనుమతించటంపై సీఎం సెక్యూరిటీ లోని డొల్లతనం స్పష్టంగా అర్థమవుతుంది. వేదపండితుల ముసుగులో ఎవరైనా సంఘవిద్రోహ శక్తులు సీఎం ఛాంబర్ లోకి వెళ్లి, జరగరానిది జరిగి ఉంటే పరిస్థితి ఏమిటని వైసీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులు మరోసారి ఉత్పన్నం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు. అత్యంత భద్రత ఉండే విశాఖ ఎయిర్పోర్టులోనే హత్యాయత్నం జరిగినా జగన్ భద్రత విషయంలో ఇంకా సీరియస్ నెస్ రాలేదంటూ ఆశ్చర్యపోతున్నారు. ఓటమితో రగిలిపోతున్న టీడీపీ శ్రేణుల్లో ఎవరైనా దారుణాలకు పాల్పడవచ్చని అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.