ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘనవిజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే.రాష్ట్రంలో అధికార పార్టీ ఐన టీడీపీ కనీస సీట్లు కూడా రాలేదు.వైసీపీ ఏకంగా 151సీట్లు గెలిచి రికార్డు సృష్టించింది.అంతేకాకుండా మొత్తం 25ఎంపీ సీట్లకు గాను 22సీట్లు సాధించింది.టీడీపీ 23సీట్లు మాత్రమే గెలుచుకుంది.అయితే టీడీపీలో ప్రస్తుతం ఓడిపోయినవారి సంగతి పక్కన పెడితే గెలిచిన 23మంది ఎమ్మెల్యేలు పరిస్థితి ఏమిటి.జగన్ ప్రమాణస్వీకారం అనంతరం సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు.ప్రస్తుతం చంద్రబాబుకు జగన్ తీసుకున్న నిర్ణయాలు చూస్తుంటే మెంటల్ వస్తుందని చెప్పాలి.ఇది ఇలా ఉండగా చంద్రబాబుతో ఇక మనకి అవ్వదు అని కొంతమని ముఖ్య నేతలు పార్టీ మారే యోచనలో ఉన్నారని అందరికి తెలిసిందే.
ఈ మేరకు టీడీపీ పార్టీ విజయవాడ అర్బన్ మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ హుస్సేన్ బాష నిన్న రాజీనామా చేసారు.ఈ మేరకు చద్రబాబుకు లికితపూర్వకంగా లెటర్ కూడా పంపారు.అందులో పెర్కున్నదాని ప్రకారం టీడీపీ పార్టీ సిద్ధాంతాలు మర్చిపోయి,మైనార్టీలను దూరం పెట్టి 6నెలలు ముందు కేవలం ఓటు బ్యాంకు కోసం మైనారిటీలకు కొన్ని చిల్లరి పదవులు వేసారు.వేరే పార్టీలు చూస్తే మైనార్టీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు.ఈ రెండు పార్టీలతో పోల్చుకుంటే టీడీపీ మాకు ఏమీ చేయలేదని,ఇంకో 50సంవత్సరాలు ఇక్కడే ఉండినా న్యాయం జరగదని అన్నారు.