ప్రముఖ సినీ, రంగ స్థలనటుడు, దర్శకుడు, రచయిత గిరీశ్ కర్నాడ్ (81) కన్ను మూశారు. బెంగళూరులోని ఆయన స్వగృహంలో సోమవారం ఉదయం 6.30గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు. గిరీష్ కర్నాడ్ 19 మే1938లో మహారాష్ట్రలోని మాథేరాన్ ప్రాంతంలో జన్మించారు. కన్నడలో పలునాటకాలు రచించి వెలుగులోకివచ్చారు. 1970లో ‘సంస్కారా’ అనే సినిమా ద్వారా ఆయన సినిమాల్లో ఆరంగేట్రంచేశారు. తర్వాత కన్నడ, హిందీ, తమిళం, మలయాళం సినిమాల్లో నటించారు. వెంకటేశ్ హీరోగా నటించిన ‘ధర్మచక్రం’ ద్వారా ఆయన టాలీవుడ్లో అడుగు పెట్టారు. శంకర్‌దాదా-ఎంబీబీఎస్, కొమరం పులి, స్కెచ్ ఫర్ లవ్ సినిమాల్లో నటించారు. అలాగే బుల్లితెరపై సంచలన విజయం సాధించిన ‘మాల్గుడి డేస్’ అనే సీరియల్లో నటించారు. చివరిగా అప్నాదేశ్ అనే కన్నడ సినిమాలోనూ నటించారు. ఈసినిమా ఈ ఏడాది ఆగస్టు 26న విడుదలకానుంది. అయితే మద్రాస్‌లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్‌లో పనిచేస్తున్న సమయంలో డా.సరస్వతి గణపతిని ఆయన ఓ పార్టీలో కలుసుకున్నారు. దాదాపు పది సంవత్సరాల తర్వాత వాళ్లు వివాహం చేసుకోగా వీరికి ఇద్దరు సంతానం ఉన్నారు.
సాహిత్యంలోనూ మంచి పట్టు ఉన్న ఆయనకు 1998లో సాహిత్య అకాడమీ వాళ్లు జ్ఞానపీఠ్ అవార్డును ప్రధానం చేశారు. అంతేకాక.. సాహిత్య రంగంలో ఆయన అందించన సేవలకు భారత ప్రభుత్వం 1974లో పద్మశ్రీ, 1992లో పద్మ భూషణ్ అవార్డులు ఇచ్చింది. సినిమాలకు సంబంధించి ఆయన ఏడు ఫిలింఫేర్ అవార్డులు, 10 జాతీయ అవార్డులు అందుకున్నారు. గిరీశ్ కర్నాడ్ మృతిపై పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేశారు