ఏపీ ప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ఆ పార్టీకి చెందిన మాజీ ఎంపీ,సీనియర్ నేత షాక్ ఇవ్వబోతున్నారా..?. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కల్గిన ఘోరపరాజయాన్ని మరిచిపోకముందే బాబుకు మరో షాక్ తగలనున్నదా..?. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన సిట్టింగ్ ఎంపీ కేశినేని నాని పార్టీ మారబోతున్నారు అని వార్తలు వస్తోన్న తరుణంలో తాజాగా ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత పార్టీ మారబోతున్నారు అని వస్తున్న వార్తలు బాబును మరింత ఆందోళనకు గురిచేస్తుంది.
ఈ క్రమంలో ఇటీవల చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గం నుండి టీడీపీ తరపున బరిలోకి దిగి ఓడిపోయిన తాజా మాజీ ఎంపీ శివప్రసాద్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు అని చిత్తూరు జిల్లా రాజకీయాల్లో సంచలనం రేకెత్తిస్తున్నాయి. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన నేతలు పలువురు బీజేపీలో వెళ్తున్నారని వార్తలు వస్తోన్న తరుణంలో మాజీ ఎంపీ అయిన శివప్రసాద్ తన రాజకీయ భవిష్యత్తుకోసం వైసీపీలో చేరడం ఖాయమని అంటున్నారు. గతంలో పలుమార్లు బాబుపై తన అసంతృప్తిని వ్యక్తం చేసిన సంగతి విదితమే. దళితులకు అన్యాయం చేస్తున్నాడు.
మంత్రి వర్గంలో ఎస్సీలకు ప్రాధాన్యత లేదని కూడా గతంలో పలుసార్లు ఆరోపించారు కూడా.. అయితే ముఖ్యమంత్రి అయిన జగన్ తన క్యాబినెట్లో ఎస్సీలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా ఉప ముఖ్యమంత్రి ,హోమ్ శాఖ మంత్రి పదవులివ్వడంతో వైసీపీలో దళితులకు న్యాయం జరుగుతుందని నమ్మిన శివప్రసాద్ వైసీపీలో చేరడం ఖాయమంటున్నారు రాజకీయ విశ్లేషకులు.