వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తొలి మంత్రివర్గంలో పదవీస్వీకార ప్రమాణం చేసిన వెల్లంపల్లి శ్రీనివాసరావు కృష్ణాజిల్లా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి గెలిచారు. తాజాగా జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి షబనా ముసరాత్ ఖాతూన్ (జలీల్ ఖాన్) పై 7,671 ఓట్ల మెజర్టీతో విజయం సాధించారు. 2009లో రాజకీయాల్లోకి ప్రవేశించిన వెల్లంపల్లి ఆ ఎన్నికల్లో ప్రజారాజ్యం నుంచి గెలిచారు. తొలిసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. 2014 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి చెందారు. అనంతరం వైఎస్సార్‌సీపీలో చేరి.. విజయం సాధించారు.. రాజధానిలో పార్టీని పటిష్టం చేయడంతోపాటు, కృష్ణా జిల్లాలో పార్టీ శ్రేణులను సమాయత్తం చేసారు. సౌమ్యుడు, మంచి వ్యక్తిగా తాజాగా ఈయనకు పేరుంది.ఈయనకు దేవాదాయ శాఖ ఇవ్వడం జరిగింది.
