జగన్‌మోహన్‌రెడ్డి తొలి మంత్రి వర్గంలో పదవీస్వీకార ప్రమాణం చేసిన కళత్తూరు నారాయణస్వామి చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలిచారు. సుధీర్ఘ రాజకీయ అనుభవంతో పాటు వైఎస్ కుటుంబానికి విధేయుడిగా ఉన్న నారాయణ స్వామికి మంత్రివర్గం లో చోటుదక్కడంపై హర్షాతిరేఖాలు వ్యక్తమవుతున్నాయి. కార్యకర్త స్థాయి నుంచి సమితి అధ్యక్షుడిగా, మూడుసార్లు ఎమ్మెల్యేగా ఆయనకు సుదీర్ఘరాజకీయ అనుభవం ఉంది. ప్రత్యేకించి దళిత సామాజిక వర్గానికి అవకాశం కల్పించాలని మంత్రివర్గంలో చోటు కల్పించారు. తొలిసారి దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆశీర్వాదంతో 2004 ఎన్నికల్లో సత్యవేడు నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన నారాయణస్వామి ఆ తరువాత 2014, 2019 ఎన్నికల్లో గంగాధనెల్లూరు నుంచి ఎమ్మెల్యేగా భారీ విజయం సాధించారు. వైఎస్ దివంగతులయ్యాక కాంగ్రెస్ పార్టీకి రాజీనామాచేసి వైఎస్ జగన్ వెంటనడిచారు. వైఎస్సార్‌సీపీ ఆవిర్భావం తర్వాత జిల్లా అధ్యక్షుడిగా సుదీర్ఘకాలం పనిచేశారు.