జగన్‌మోహన్‌రెడ్డి తొలి మంత్రివర్గంలో పదవీ స్వీకారప్రమాణం చేసిన మేకపాటి గౌతమ్‌రెడ్డి నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం నుంచి గెలిచారు. వైఎస్సార్‌సీపీ ఆవిర్భానికి ముందు నుంచి మేకపాటి కుటుంబం జిల్లాలోని వైసీపీకి అండగా నిలబడింది. ప్రధానంగా మాజీఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి వైఎస్ జగన్ నాయకత్వంపై సంపూర్ణ విశ్వాసంతో కాంగ్రెస ఎంపీగాఉండి వెంటనే పదవికి రాజీనామాచేసి వైఎస్సార్‌సీపీలో చేరి భారీ మెజార్టీతో ఎంపీగా గెలుపొందారు. ఆయన సోదరుడు ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి కూడా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి జగన్ వెంట నడిచారు. ఆ కుటుంబ వారసుడిగా, జగన్‌కు సన్నిహితుడిగా ఉండే గౌతమ్‌రెడ్డి 2014ఎన్నికల్లో ఆత్మకూరు నియోజకవర్గంనుంచి పోటీచేసి జిల్లాలో అత్యధిక మెజార్టీతో గగెలిచారు. వరసగా రెండో పర్యాయం కూడా అదే నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థి బొల్లినేని కృష్ణయ్యపై ఘనవిజయం సాధించారు. దీంతో వైఎస్ జగన్ తొలి మంత్రిమండలిలో చోటు దక్కించుకున్నారు.ఈయనకు పరిశ్రమలు, వాణిజ్యం శాఖ ఇచ్చారు.