ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఘనవిజయం సాధించింది.ఫ్యాన్ గాలి దెబ్బకు తెలుగు తమ్ముళ్ళు ఎగిరిపోయారు.జగన్ సృష్టించిన సునామీకి టీడీపీ పార్టీలో హేమాహేమీలు సైతం ఓడిపోయారు.ఇక అసలు విషయానికి వస్తే..కోడెల శివప్రసాద్ ఈయన ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్.ఈ వ్యక్తి మామోలు మనిషి కాదు,టీడీపీ పేరు చెప్పుకొని ఈయన దోచుకున్నది అంతా ఇంతా కాదు.ఈయన పేరు చెప్పుకొని కుటుంభం మొత్తం ప్రజలపై పది దోచుకున్నారు.దీనిపై స్పందించిన వైసీపీ రాజ్యసభ సభ్యుడు ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా తనదైన శైలిలో కోడెలపై విరుచుకుపడ్డాడు.ప్రజలు, వ్యాపారులను బెదిరించి డబ్బు వసూలు చేసిన కోడెల కుటుంబ సభ్యులెవరూ చట్టం నుంచి తప్పించుకోలేరని,‘కే’ ట్యాక్స్ పేరుతో వందల కోట్లు దోచుకున్నారని, దీనికి సహకరించిన అధికారులు కూడా దోషులేనని ఆయన అన్నారు. నిర్బంధ వసూళ్ల మాఫియా అరాచకాలపై దర్యాప్తు జరుగుతుంది. బాధితులు నిర్భయంగా ఫిర్యాదు చెయ్యాలని ఆయన సూచించారు.
ప్రజలు, వ్యాపారులను బెదిరించి డబ్బు వసూలు చేసిన కోడెల కుటుంబ సభ్యులెవరూ చట్టం నుంచి తప్పించుకోలేరు. ‘కే’ ట్యాక్స్ పేరుతో వందల కోట్లు దోచుకున్నారు. దీనికి సహకరించిన అధికారులు కూడా దోషులే. నిర్బంధ వసూళ్ల మాఫియా అరాచకాలపై దర్యాప్తు జరుగుతుంది. బాధితులు నిర్భయంగా ఫిర్యాదు చేయాలి.
— Vijayasai Reddy V (@VSReddy_MP) June 9, 2019