ప్రధాని మోదీ ఆదివారం తిరుమలలోని శ్రీవారిని దర్శించుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మోడీకి ఘన స్వాగతం పలికారు. ఈ క్రమంలో ముందుగా తిరుమలకు చేరుకున్న పీఎం మోడీ కాన్వాయ్ లో నుంచి నరేంద్ర మోడీ దిగారు. దిగి పక్కనే ఉన్న సెక్యూరిటీ సిబ్బందిని ఏపీ సీఎం గురించి అడిగారు. వచ్చేస్తున్నారని చెప్పినా జగన్ వచ్చేంత వరకూ ఆగి సీఎంతో పాటు కలిసి ఆలయంలోకి ప్రవేశించారు. తిరుమలకు చేరుకున్న ప్రధానికి అర్చకులు, టీటీడీ ఈవో ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం మోదీ.. స్వామి వారి మూలమూర్తిని దర్శించుకున్నారు.
