వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తొలి మంత్రివర్గంలో పదవీ స్వీకార ప్రమాణం చేసిన మోపిదేవి వెంటకరమణావు గతంలో రేపల్లె అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఓటమిచెందారు. అయినా మంత్రిగా అవకాశం దక్కించుకున్నారు. టీడీపీ అభ్యర్థి అనగాని సత్యప్రసాద్‌పై 11,555 ఓట్ల తేడాతో ఓటమి పొందారు. 1984లో రాజకీయంలో రంగ ప్రవేశం చేసిన మోపిదేవి తొలుత కాంగ్రెస్ తరఫున ఎంపీటీసీగా ఎన్నికయ్యారు. ఆ తరువాత 1989లో కూచిపూడి అసెబ్లీకి పోటీ చేసి 54ఓట్ల తేడాతో ఓడిపోయారు. అనంతరం 1999, 2004లో కూచిపూడి ఎమ్మెల్యేగా, 2009లో రేపల్లె ఎమ్మెల్యేగా వరుసగా మూడు సార్లు గెలుపొందారు. దివంగత వైఎస్సార్ హాయంలో మంత్రిగా పనిచేసారు. వాన్ పిక్ భూముల కేసుల్లో అరెస్టయ్యారు. వైఎస్ కుటుంబానికి విధేయునిగా ఉన్నారు.
