జగన్మోహన్రెడ్డి తొలి మంత్రివర్గంలో పదవీస్వీకార ప్రమాణంచేసిన బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి కర్నూలు జిల్లా డోన్ అసెంబ్లీ నియోజకవర్గంనుంచి గెలుపొందారు. 2014ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా డోన్ నుంచి పోటీచేసి టీడీపీ అభ్యర్థి కేఈ ప్రతాప్‌పై విజయం సాధించారు. ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ స్థానం నుంచి మరోసారి పోటీ చేసిన బుగ్గన.. టీడీపీ అభ్యర్థి కేఈ ప్రతాప్‌పై 35,516 ఓట్ల భారీ మెజార్టీతో వరుసగా రెండోసారి గెలుపొందారు. చంద్రబాబు నాయుడి గత ప్రభుత్వంలో బుగ్గన పీఏసీ చైర్మన్‌గా వ్యవహరించారు. ఈయన ఇంజనీరింగ్ చదువుకున్నారు. మేధావిగా. లెక్కలు, విశ్లేషణలు మాట్లాడే వ్యక్తిగా బుగ్గనకు పేరుంది, సౌమ్యుడు, వివాద రహితుడు.ఈయనను ఆర్థిక, ప్రణాళిక, శాసనసభ వ్యవహారాలు నిర్మించారు.