వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తొలి మంత్రివర్గంలో పదవీ స్వీకారప్రమాణం చేసిన పేర్నినాని.. కృష్ణా జిల్లా మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలిచారు. ఇప్పటికి ఆయన మూడోసారి విజయం సాధించారు. రాజకీయాల్లో అనుభవం ఉండడంతో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తొలి మంత్రివర్గంలోనే స్థానం దక్కించుకున్నారు. ఇటీవల ముగిసిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి, మాజీ మంత్రి కొల్లు రవీంద్రపై 5,851 ఓట్లతేడాతో గెలుపొందారు. తండ్రినుంచి వారసత్వంగా రాజకీయాలను పుణికిపుచ్చుకున్న నాని 1999లో తొలిసారి అసెంబ్లీకి పోటీచేసి ఓటమిచెందారు. ఆ తరువాత 2004, 2009లో వరుసగా రెండుసార్లు ఎన్నికయ్యారు. కిరణ్‌కుమార్ మంత్రివర్గంలో ప్రభుత్వ విప్ గా పనిచేశారు. 2013లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వైఎస్సార్‌సీపీలో చేరారు. 2014లో ఎన్నికల్లో పోటీచేసి ఓటమి చెందినా ప్రజల పక్షాన నిలబడ్డారు. గతంలో కొడాలి నానితోపాటు జగన్ కు మద్దతుగా నిలిచినందుకు పార్టీనుంచి సస్పెండయ్యారు.ఈయనకు రవాణా, సమాచార శాఖ ఇవ్వడం జరిగింది.
