జగన్‌మోహన్‌రెడ్డి తొలి మంత్రి వర్గంలో పదవీ స్వీకారప్రమాణం చేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలిచారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో ఒంగోలు అసెంబ్లీస్థానంనుంచి పోటీచేసిన బాలినేని టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్‌పై 21,507ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇప్పటివరకు ఈయన ఐదుసార్లు విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీలో యువజన కాంగ్రెస్ జిల్లాఅధ్యక్షునిగా రాజకీయ జీవితం ప్రారంభించారు. ఆయన 1999లో తొలిసారిగా ఒంగోలు అసెంబ్లీ స్థానం నుండి పోటీచేసి విజయం సాధించారు. 2004, 2009 లలో వరుస విజయాలు సాధించి హ్యాట్రిక్ రికార్డు సొంతం చేసుకున్నారు. రెండోసారి వైఎస్సార్ ప్రభుత్వంలో గనులశాఖ, చేనేత జౌళి మరియు స్పిన్నింగ్, చిన్న తరహా పరిశ్రమల శాఖా మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2012లో జరిగిన ఉపఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరుపున పోటీచేసి విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో తొలిసారి ఓటమిపాలయ్యారు. అండర్ గ్రాడ్యుయేషన్ చదువుకున్నారు.ఈయనకు అటవీ, విద్యుత్, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇచ్చారు.