జగన్‌మోహన్‌రెడ్డి తొలి మంత్రివర్గంలో పదవీస్వీకార ప్రమాణం చేసిన పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు సిటీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి, మంత్రి నారాయణపై 1,988 ఓట్ల తేడాతో సంచలన విజయాన్ని నమోదు చేసారు. 2014 ఎన్నికల్లో తొలిసారి గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆయన చిన్నాన్న సుధాకర్ మృతిచెందడంతో 2008లో నెల్లూరు నగరంలోని 20 డివిజన్ నుంచి కార్పొరేటర్‌గా గెలిచారు. 2009 ఎన్నికల్లో నెల్లూరు సిటీ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశ దక్కింది. 91 ఓట్ల స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. అనంతరం వైసీపీలో చేరి క్రియాశీలకంగా వ్యవహరించారు. 2014,19 ఎన్నికల్లో నెల్లూరు నగరం నుంచి ఘనవిజయం సాధించారు. చిన్న వయస్సులో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన అనిల్.. తాజాగా మంత్రిగా నియమితులై చరిత్ర సృష్టించారు. యువకుడిగా, అగ్రెసివ్ ఎమ్మెల్యేగా రాష్ట్రవ్యాప్తంగా అనిల్ కు క్రేజ్ ఉంది.ఈయనకు ఇరిగేషన్ శాఖ ఇచ్చారు.