వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తొలి మంత్రివర్గంలో పదవీ స్వీకారప్రమాణం చేసిన ఆళ్ల నాని పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసి గెలుపొందారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తొలి మంత్రివర్గంలోనే కేబినేట్ మంత్రిగా అవకాశం దక్కించుకున్నారీయన. 2014 ఎన్నికల్లో తొలిసారి వైఎస్సార్‌సీపీ నుంచి పోటీచేసి ఓడిపోయారు, ఇటీవల ముగిసిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి బడేటి కోట రామారావుపై 4,072 ఓట్ల తేడాతో గెలిచారు. నానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి అనుంగ శిష్యుడిగా పేరుంది. 1994లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఏలూరు నుంచి పోటీచేసి ఓటమి చెందారు. అలాగే 1999లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి రెండోసారి కుడా ఓడిపోయారు.. మళ్లీ 2004, 2009లో వరుసగా రెండుసార్లు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి ఘన విజయం సాధించారు. 2014లో వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయినా 2019లో మాత్రం విజయం సాధించి మంత్రిగా స్థానం పొందారు. వైసీపీ పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడిగా పార్టీ విజయానికి పనిచేసారు.ఈయనకు వైద్య, ఆరోగ్య శాఖ ఇవ్వడం జరిగింది.
