ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జగన్ సంచలన విజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే.ఫ్యాన్ గాలి దెబ్బకు తెలుగు తమ్ముళ్ళు ఎగిరిపోయారు.అదే ఊపుమీద ఉన్నజగన్ ప్రమాణస్వీకారం చేయకముందే చాలా వరకు తన భాద్యతలను చేపట్టడం జరిగింది.ఇక ప్రమాణస్వీకారం అనంతరం యువ కెరటంలా దూసుకుపోతూ కనీవినీ ఎరుగని రీతిలో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు.అంతేకాకుండా ఈరోజు మంత్రివర్గాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది.అయితే దీపిపై స్పందించి కేంద్ర మాజీమంత్రి, బీజేపీ సీనియర్ నేత, రెబల్‌స్టార్ కృష్ణంరాజు జగన్ పై ప్రశంసలు జల్లు కురిపించాడు.
ఆంధ్రప్రదేశ్ రెండవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన మంత్రివర్గంలో బీసీ,ఎస్సీ, ఎస్టీ, బలహీన, మైనారిటీ వర్గాలకు అత్యున్నత ప్రాధాన్యత ఇవ్వడం పట్ల చాలా సంతోషంగా ఉందన్నారు.అంతేకాకుండా ఇదుగురికి ఉప ముఖ్యమంత్రులుగా ఇవ్వడం మామోలు విషయం కాదని,దేశాలోనే ఇది ఒక సంచలన నిర్ణయమని అన్నారు.అతి చిన్న వయస్సులోనే ఇంత బాగా అలోచించి సరైన నిర్ణయాలు తీసుకుంటున్నారు అంటే..మీరు నిజంగా రియల్ హీరో అని అన్నారు.మీ విజయం రాష్ట్రానికి ఎంతో అవసరమని నమ్మి గెలిపించినందుకు ప్రజలకు మీరు ఎంత చేయగలరో కొద్దిరోజుల్లోనే తెలిసిపోయిందని అన్నారు.ఈ నేపధ్యంలోనే జగన్ మొదటిసారి సచివాలయంకి అడుగుపెట్టిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.