వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తొలి మంత్రివర్గంలో పదవీస్వీకార ప్రమాణం చేసిన తానేటి వనిత పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థి వంగలపూడి అనితపై 25,248 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. ఎస్సీ రిజర్వుడ్ స్థానమైన కొవ్వూరులో 2014ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయారు. అనంతరం ఐదేళ్లపాటు ప్రజాసమస్యలపై పోరాడి ఈమె ఈసారి విజయం సాధించారు. నియోజకవర్గం ఏర్పడిన తర్వాత తొలి మహిళా ఎమ్మెల్యేగా, తొలి మహిళా మంత్రిగా వనిత అరుదైనఘనత దక్కించుకున్నారు. వనిత తొలిసారి 2009లో గోపాలపురం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. 2012 నవంబర్ 4న వైఎస్సార్ సీపీలో చేరారు. వనిత తండ్రి జొన్నకూటి బాబాజీరావు గోపాలపురం నుంచి రెండు సార్లు టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. తల్లి రిటైర్డ్ ఉపాధ్యాయిని. భర్త శ్రీనివాసరావు వైద్యుడు.ఈమెకు మహిళా శిశుసంక్షేమం శాఖా ఇవ్వడం జరిగింది.
