టీమిండియా కెప్టెన్ కోహ్లికి రూ.500 జరిమానా విధించారు.తన ఇంటి పనిమమిషి చేసిన నిర్వాకానికి ఈ జరిమానా విధించారు.ఇంక అసలు విషయానికి వస్తే.. విరాట్ కోహ్లి నివాసం గురుగ్రామ్ లో ఉంది.ఇక్కడ నీటి కొరత అంతా ఇంత కాదు,చాలా ఎక్కువనే చెప్పాలి.కోహ్లి ఇంట్లో పనిమనిషి మంచి నీటితో కారు కడిగింది.దీనిని చూసిన ఒక వ్యక్తి వీడియో తీసి అధికారులు ముందు పెట్టాడు. దీంతో రంగంలోకి దిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ గురుగ్రామ్ కోహ్లీకి రూ. 500 జరిమానా విధించింది.ఈ మేరకు నోటిసులు కూడా పంపించారు.ప్రస్తుతం మన దేశంలో నీటి కొరత చాలా ఎక్కువ ఉంది.ఈ ఎండాకాలం పూర్తి అయ్యేవరకు చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవలసిన అవసరం ఉంది.ఈమేరకు అధికారులు ఏమీ చెప్పిన ఎవరు వినడం లేదని చెప్పాలి.