వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తొలి మంత్రివర్గంలో పదవీ స్వీకార ప్రమాణం చేసిన పాముల పుష్పశ్రీవాణి విజయనగరం జిల్లా కురుపాం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలిచారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి నరసింహ ప్రియా థాట్రాజ్‌పై 26,602 ఓట్ల మెజార్టీతో భారీ విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో కూడా థాట్రాజ్‌పైనే విజయం సాధించారు. గిరిజన ప్రాంతాల ప్రజల సమస్యలకోసం నిరంతరం పోరాడారు. తాజా ఎన్నికల్లో ఆమెను ఓడించేందుకు టీడీపీ చేసిన విశ్వప్రయత్నాలు ఫలించలేదు. చివరికి ఆమెపై, ఆమె భర్తపైనా హత్యాయత్నానికి పాల్పడినా బెదరలేదు. అనేక కుట్రలను ఎదుర్కొని ఈ రోజు మంత్రి వర్గంలో స్థానం సంపాదించుకున్నారు. చిన్నవయసులోనూ నమ్మకమైన, నీతివంతమైన రాజకీయాలు చేసినందుకు జగన్ ఆమెను ప్రశంశించారు. ఫిరాయింపు రాజకీయాలు చేయాలని టీడీపీ ప్రభుత్వం ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా వీరు జగన్ వెంటే నడిచారు. ఈమె భర్తపేరు శత్రుచర్ల పరీక్షిత్ రాజు వైసీపీ నాయకుడు. ఈమె బీఎస్సీ చదువుకున్నారు.
