జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా మారాయి. ఎన్నికలు పద్ధతి ప్రకారం జరగలేదని, సొంతపార్టీ నేతల వద్ద పవన్ అభిప్రాయపడ్డారు. శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాల నుంచి జనసేన తరుఫున పోటీచేసిన అభ్యర్థులతో శుక్రవారం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జిల్లాల వారీగా సమావేశమయ్యారు. వారితో మాట్లాడుతూ ఎన్నికలు పద్ధతిగా జరిగి ఉంటే ఫలితాలు మరోలా ఉండేవని పవన్ చెప్పారు. 2014 ఎన్నికల సమయంలోకానీ, ఇప్పుడు 2019 ఎన్నికల టైంలోకానీ రాష్ట్రంలో ఎలాంటి రాజకీయ శూన్యత లేదని కల్యాణ్ వ్యాఖ్యానించారు.
అయినా, ఈ ఎన్నికల్లో వైఎసీపీ, టీడీపీ, కేంద్రంలో ఉన్న బీజేపీలతో మనం పోరాడామన్నారు. ప్రస్తుత ఫలితాలతో దిగులుపడకుండా ఎవరికి వారు స్వీయ పరిశీలన చేసుకుని ముందుకు వెళ్దామన్నారు. అయితే ఎన్నికలు సజావుగా జరగకపోయి ఉంటే ఘోర ఓటమి తర్వాత చంద్రబాబు తీవ్ర ఆందోళన చేసేవారు. ప్రజాతీర్పును గౌరవించి చంద్రబాబు కిమ్మనడం లేదు. అయితే పవన్ ఇంకా అప్ డేట్ అవలేదని, చంద్రబాబు ఎప్పుడో చెప్పిన మాటలనే, ఆ స్క్రిప్టునే ఇంకా మాట్లాడుతున్నారని, పార్టీ ఈ ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడిపోయినా పవన్ తీరులో మార్పు రాలేదంటూ పార్టీ నేతలే నవ్వుకున్నారట.