ఇటీవల జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్, పంచాయితీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ రోజు జరిగిన జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికల్లో కూడా గతంలో ఎక్కడా, ఎప్పుడూ లేని విధంగా నూటికి నూరుశాతం 32 జెడ్పీ స్థానాల్లో 32 స్థానాలు కైవసం చేసుకొని చరిత్ర సృష్టించింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కంటే పరిషత్ ఎన్నికల పోలింగ్ శాతం అధికంగా నమోదైంది. ఈ నేపధ్యంలోనే మండల, జెడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు ఘోర పరాభవం ఎదురైంది. 6 జిల్లాల ఎంపీపీల్లోనూ టీఆర్ఎస్ క్లీన్ స్వీప్(సిద్దిపేట, కరీంనగర్, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, కొమురం భీం- ఆసిఫాబాద్, పెద్దపల్లి) చేసింది.కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ అత్యంత సజావుగా పూర్తి చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వం.. జిల్లాల విభజన తర్వాత జరిగిన తొలి పరిషత్ ఎన్నికలను కూడా అంతకంటే ప్రశాంతంగా, సజావుగా ముగించి చరిత్ర సృష్టించింది.
