తెలంగాణలో రాష్ట్రంంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొంది నూతనంగా ఎన్నికైనా జిల్లా పరిషత్ చైర్మన్లకు టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలోని మొత్తం 32 జెడ్పీ పీఠాలు టీఆర్‌ఎస్ పార్టీ కైవసం అయిన విషయం తెలిసిందే. ఇంతటి ఘన విజయాన్ని అందించిన రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలన్నారు. టీఆర్‌ఎస్ క్షేత్రస్థాయి కార్యకర్తలకు అలాగే సోషల్ మీడియా సోల్జర్స్‌కు అభినందనలు తెలుపుతూ కేటీఆర్ ధన్యవాదాలు తెలియజేశారు.
