తెలంగాణలో జరిగిన పంచాయితీరాజ్ సంస్థల ఎన్నికల్లో అనితర సాధ్యమైన రీతిలో అద్భుతమైన విజయాలను సాధించిన పంచాయితీరాజ్ విజేతలైన మండల ప్రజా పరిషత్, జిల్లా ప్రజా పరిషత్ సభ్యులకు, అధ్యక్షులకు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు అభినందనలు, శుభాకాంక్షలు తెలియచేశారు. విశేషమైన కృషి చేసి తెరాస పార్టీకి అఖండ విజయం సాధించి పెట్టిన పార్టీ కార్యకర్తలకు సీఎం కేసీఆర్ గారు ధన్యవాదాలు తెలియచేశారు. అలాగే ఇంత పెద్ద ఎత్తున విజయం అందించిన ప్రజలకు, ఓటర్లకు ధన్యవాదాలు చెప్పారు. ఈ విజయం ప్రజా విజయమని కేసీఆర్ గారు పేర్కొన్నారు.
