ఏపీ ముఖ్యమంత్రి,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి రాష్ట్రంలోని జర్నలిస్టులకు శుభవార్తను ప్రకటించారు. ఈ రోజు శనివారం ఉదయం ఎనిమిదిన్నరకు సచివాలయానికి వచ్చిన సీఎం జగన్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముందుగా ఇటీవల ప్రకటించిన ఆశావర్కర్లకు రూ. మూడు వేల నుండి పదివేలకు జీతం పెంచుతున్నట్లు ఆదేశాలిస్తోన్న పైల్ పై సంతకం చేశారు. ఆ తర్వాత అనంత ఎక్స్ ప్రెస్ హైవే కి సంబంధిత పనుల గురించి పైల్ పై రెండో సంతకం చేశారు. ఆ తర్వాత జర్నలిస్టులకు ఇన్సూరెన్స్ పరిమితిని రూ. పది లక్షలకు పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మూడో సంతకం జర్నలిస్టులకు సంబంధించిన ఫైల్ పై చేశారు సీఎం జగన్
