ప్రస్తుత ఆధునీక రోజుల్లో బిజీ బిజీ షెడ్యూల్ కారణంగా సరిగా తినకపోవడం.. సరిగా నిద్రపోకపోవడం లాంటి వాటి వలన ఉన్నఫలంగా లావు ఎక్కుతారు త్వరగా. అయితే ఇలా అనవసరంగా పెరిగిన శరీర బరువును తగ్గించుకోవాలంటే ఏమి చేయాలో తెలుసా..?. కొంతమంది శాస్త్రవేత్తలు ఉదయాన్నే ఇలాంటి పనులుచేస్తే లాభముంటుందని చెబుతున్నారు.ఇటీవల వచ్చిన ఒక సర్వే ప్రకారం నిద్రలేవగానే పొద్దు పొద్దున్నే వెలుగును ప్రసాదించే సూర్యకిరణాలను ఆస్వాదించడం ద్వారా శరీర బరువును తగ్గించుకోవచ్చు అని తేలింది. అంతేకాకుండా రోజంతా చాలా యాక్టివ్ గా ఉండవచ్చు. ఉదయం వాకింగ్,జాగింగ్, వ్యాయమాలు చేయడం వలన కూడా ఫలితముంటుందని అంటున్నారు. మనం తీసుకునే అల్పాహారాల్లో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటే బరువును నియంత్రించుకోవచ్చు అని తేలింది. మరి ముఖ్యంగా ఫైబర్ ,ప్రోటీన్లు చాలా ఎక్కువగా ఉన్న పదార్థాలు తినడం వలన కూడా ఈ ఫలితం పొందవచ్చు..
