ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అత్యంత కీలక పదవులు ఇస్తున్నట్లు వార్తలు వస్తోన్నాయి. ఈ క్రమంలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి తిరుపతి అర్భన్ డెవలప్మెంట్ (తుడా)చైర్మన్ గా నియమితులు కాబోతున్నారని వైసీపీ శ్రేణులు చెబుతున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్ది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి స్పష్టమైన సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం.అయితే గతంలో తుడా చైర్మన్ గా పనిచేసిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తాజాగా వైసీపీ సర్కారులో ప్రభుత్వ విప్ గా వ్యవహారించనున్నారు అని కూడా వైసీపీ శ్రేణులు ప్రచారం చేస్తున్నారు. మంత్రి పదవీ దక్కకపోవడంతో జోడు పదవులు అన్నట్లు ప్రభుత్వ విప్,తుడా చైర్మన్ పదవులు జగన్ కానుక ఇస్తున్నట్లు చెవిరెడ్డి అనుచరవర్గం తెగ ప్రచారం చేసుకుంటుంది.
